NationalPolitics

కాంగ్రెస్ పార్టీకీ మాయావతి అల్టిమేటమ్

భల రాజకీయం

 

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. చత్తీస్‌గఢ్‌లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మాత్రం బీఎస్పీ మద్దతు తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మద్దతిస్తామని స్వయంగా ప్రకటించడంతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మాయావతి …. చాలా పవర్ ఫుల్ లీడర్ . అధికారంలో ఉన్న బీజేపీ మీద, ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్ మీద అయిష్టత వ్యక్తం చేస్తున్న నేత. ఇక అవసరం అయిన చోట కీలకంగా వ్యవహరించి అటు కాంగ్రెస్ , బీజేపీ ల మేడలు వంచే ప్రయత్నం చేస్తున్న నేత . ఒక పక్క దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మాయావతి ఏం చేశారో తెలుసా.

కొత్త ప్రభుత్వాలు ఏర్పడి నెల రోజులైనా కాకముందే మాయావతి కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. అంతేకాదు, తాను చెప్పినట్లు వినకపోతే మద్దతును ఉపసంహరించుకుంటామని బెదిరించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది.. మాయావతి చెప్పినట్లే చేసింది. సోమవారం ఆమె ‘‘భారత్‌ బంద్‌ సమయంలో అమాయకులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ఈ విషయంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు త్వరగా చర్యలు చేపట్టాలి. లేదంటే ప్రభుత్వాలకు మద్దతిచ్చే అంశంపై బీఎస్పీ పునరాలోచించాల్సి ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

బీఎస్పీ అధ్యక్షురాలు చేసిన ప్రకటనతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా పంతాలకు పోకుండా సర్ధుకుపోయే ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరికలతో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సర్కార్‌ దిగివచ్చింది. యూపీ, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌ సహా అప్పటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భారత్‌ బంద్‌ నేపథ్యంలో అమాయక దళితులపై కేసులు నమోదు చేశారని, వీటిని మధ్యప్రదేవ్‌, రాజస్ధాన్‌లో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించాలని మాయావతి సోమవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు.

మాయావతి డిమాండ్‌ను మధ్యప్రదేశ్‌ సర్కార్‌ అంగీకరించింది. భారత్‌ బంద్‌ నేపథ్యంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం మోపిన రాజకీయ కేసులన్నింటినీ ఉపసంహరించాలని నిర్ణయించామని న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి పీసీ శర్మ పేర్కొన్నారు. దీంతో అటు దళితులు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడే ఇలా వుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో మాయావతి కీలకంగా మారితే ఏం చేస్తారో మరి .

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close